బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

నేటి భారత్ న్యూస్- గత కొంతకాలంగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ. 90 వేలు దాటింది. పసిడితోపాటు పెరిగే వెండి కిలో ధర రూ. 1.03 లక్షలకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది.  అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపైకి పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ. 2,983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ. 90,450కి చేరుకుంది. కిలో వెండి ధర రూ. 1,03 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. 

Related Posts

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

నేటి భారత్ న్యూస్-క్రికెటర్లు విదేశీ పర్యటనలో వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టారు. మ్యాచ్ ఆడే సమయంలో క్రీడాకారులు చాలా ఒత్తిడితో ఉంటారని, ఆ సమయంలో వారికి…

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

నేటి భారత్ న్యూస్- ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మరికొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

బీసీసీఐ ‘ఫ్యామిలీ మెంబర్స్’ రూల్ పట్ల కోహ్లీ అసంతృప్తి!

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

మరికొన్ని గంటల్లో భూమ్మీదకు సునీత, విల్మోర్

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

అనకాపల్లి జిల్లాలో కుంగిన రైల్వే వంతెన ..

మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

మ‌రోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా.. ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు

 రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు .. ఎందుకంటే..?

 రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు .. ఎందుకంటే..?

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ