మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొన్న ట్రంప్

నేటి భారత్ న్యూస్- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్.. తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం చేసుకున్నారు. ఇందుకోసం 80 వేల డాలర్లు చెల్లించానని, ఒక్క డాలర్ కూడా డిస్కౌంట్ తీసుకోలేదని ట్రంప్ వివరించారు. తాను అడిగితే మస్క్ డిస్కౌంట్ ఇస్తాడు కానీ టెస్లా కంపెనీ నుంచి తాను బెనిఫిట్స్ పొందానని విమర్శలు వస్తాయని చెప్పారు. మంగళవారం వైట్ హౌస్ ఆవరణలో టెస్లా కంపెనీకి చెందిన వివిధ మోడల్ కార్లు ప్రదర్శించారు. ఇందులో రెడ్ కలర్ కారును ట్రంప్ సెలక్ట్ చేసుకుని డబ్బు చెల్లించారు. అనంతరం మస్క్ తో కలిసి కారులో కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు.  డొనాల్డ్ ట్రంప్ సర్కారులో ఎలాన్ మస్క్ సలహాదారుగా వ్యవహరించడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మస్క్ కు చెందిన టెస్లా కార్ షోరూం ముందు పలువురు నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ నిరసనలు టెస్లా కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో టెస్లా షేర్లు కూడా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ గొప్ప దేశభక్తుడని కితాబునిచ్చారు. ఆయనకు మద్దతుగా తాను ఓ టెస్లా కారును కొనుగోలు చేస్తానని చెప్పారు. మంగళవారం ట్రంప్ కోసం పలు లేటెస్ట్ మోడల్ టెస్లా కార్లను ఎలాన్ మస్క్ వైట్ హౌస్ కు తెప్పించారు. ఆయా మోడల్ కార్ల ప్రత్యేకతలను ట్రంప్ కు మస్క్ దగ్గరుండి వివరించారు. దీంతో వైట్ హౌస్ కాస్తా కాసేపు టెస్లా షోరూంలాగా మారింది.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌