మా కొంప ముంచింది అవే.. భారత్‌తో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్

నేటి భారత్ న్యూస్- చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో నిన్న దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. తొలుత పాకిస్థాన్‌ను 241 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు ఆ తర్వాత 42.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. మాజీ సారథి విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో భారత్‌కు ఘన విజయాన్ని అందించిపెట్టాడు.  మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. మ్యాచ్‌లో తాము చాలా పొరపాట్లు చేశామని, పరాజయానికి అదే కారణమని చెప్పాడు. టాస్ గెలిచినప్పటికీ దాని నుంచి ప్రయోజనం పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. వారు తమను ఒత్తిడిలోకి నెట్టేశారని పేర్కొన్నాడు. ఓడిపోయామంటే దానర్థం ఏ విభాగంలోనూ తాము రాణించలేదనేనని వివరించాడు.  కోహ్లీని కట్టడి చేద్దామని అనుకున్నా, ఆ పని చేయలేకపోయామని రిజ్వాన్ పేర్కొన్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో కోహ్లీ, గిల్ మ్యాచ్‌ను తమ చేతుల్లోంచి లాక్కున్నారని అన్నాడు. ఫీల్డింగ్‌ను తాము మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము చాలా తప్పిదాలు చేశామని చెప్పాడు కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో దారుణంగా ఓడిన పాకిస్థాన్.. తాజాగా భారత్ చేతిలో అంతే దారుణంగా ఓడింది. నేడు రావల్పిండిలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ గెలిస్తే పాక్ కథ ముగిసినట్టే. డిఫెండింగ్ చాంపియన్స్ అయిన పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌‌ను గురువారం బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌