ముంబై ఇండియన్స్ వరుసగా 13వ సారి.. చెత్త రికార్డును మూటగట్టుకున్న జట్టు

నేటి భారత్ న్యూస్- ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరుసగా 13వ సారి ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గత రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వరుస ఓటముల రికార్డును తుడిచిపెట్టేయాలని ముంబై భావించింది. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన ముంబైకి మరో ఓటమి తప్పలేదు. దీనికి తోడు చెన్నై బౌలర్లు ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు తీసి ముంబైని బెంబేలెత్తించారు. ఫలితంగా 155 పరుగుల ఓ మాదిరి స్కోరుకి పరిమితమైంది. రచిన్ రవీంద్ర (65), రుతురాజ్ గైక్వాడ్(53) అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Related Posts

వైట్ హౌస్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు… విందు నచ్చకపోతే ఫిర్యాదు చేయొద్దన్న ట్రంప్

నేటి భారత్ న్యూస్- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గతేడాది నవంబరులో జరిగిన ఎన్నికలలో మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, మధ్యప్రాచ్యంలో…

బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి… అంతా తీసుకుపోయారు: మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

వైట్ హౌస్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు… విందు నచ్చకపోతే ఫిర్యాదు చేయొద్దన్న ట్రంప్

వైట్ హౌస్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు… విందు నచ్చకపోతే ఫిర్యాదు చేయొద్దన్న ట్రంప్

బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి… అంతా తీసుకుపోయారు: మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు

బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి… అంతా తీసుకుపోయారు: మద్రాస్ ఐఐటీలో చంద్రబాబు

 వైసీపీ కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌: జగన్

 వైసీపీ కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌: జగన్

 ఏపీలో 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల నియామ‌కం

 ఏపీలో 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల నియామ‌కం

 వల్ల‌భ‌నేని వంశీకి మళ్లీ నిరాశ‌.. రిమాండ్ పొడిగింపు

 వల్ల‌భ‌నేని వంశీకి మళ్లీ నిరాశ‌.. రిమాండ్ పొడిగింపు

తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో హీరో నితిన్‌

తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో హీరో నితిన్‌