రూ.90 వేలకు చేరువలో బంగారం ధరలు

నేటి భారత్ న్యూస్- బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర ఈరోజు రూ.350 పెరిగి రూ.89,100 పలికింది. వెండి కిలో లక్ష రూపాయలు పలుకుతోంది. శుక్రవారం నాడు బంగారం ధర రూ.88,750 వద్ద ముగియగా, ఈరోజు రూ.89 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్ 2,954.71 డాలర్లు పలికింది. స్పాట్ గోల్డ్ 5.50 డాలర్లు పెరిగి ఔన్స్ 2,941.55 డాలర్లకు చేరుకుంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,550 పలుకగా, 24 క్యారెట్ల పసిడి రూ.87,870 పలికింది. భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.1.08 లక్షలు పలికింది.వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు వేయడం, వాణిజ్య యుద్ధాల భయాల ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్‌పై కనిపిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. అందుకే పసిడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి బలహీనపడటం వలన కూడా మన వద్ద బంగారం ధరకు అదనపు మద్దతు లభించిందని నిపుణులు చెబుతున్నారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌