రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. నార్సింగి పోలీసులు అప్పుడు ఆయనను రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది. కేటీఆర్‌పై కేసు కొట్టివేత కేటీఆర్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షలతో తనపై కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.

Related Posts

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

నేటి భారత్ న్యూస్-సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ భూమిని స్టూడియో కోసం…

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

నేటి భారత్ న్యూస్- తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) గద్దర్ అవార్డుల దరఖాస్తులకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ, ఎంట్రీ ఫీజు వివరాలను వెల్లడించింది. గద్దర్ అవార్డులకు సంబంధించిన దరఖాస్తులు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

 గద్దర్ అవార్డులకు సంబంధించి టీఎఫ్‌డీసీ కీలక ప్రకటన

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

భారత్ లో కాలు మోపుతున్న ట్రంప్ రియల్ ఎస్టేట్ కంపెనీ

 హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడు.. బయోపిక్ తీయొచ్చు: మహ్మద్ కైఫ్

 హార్దిక్ పాండ్యా మానసికంగా చిత్రవధ అనుభవించాడు.. బయోపిక్ తీయొచ్చు: మహ్మద్ కైఫ్

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

 ఈ నెల 29 న సూర్యగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుందంటే..?

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి

దేవ్‌మాలిపై వ్యూ అద్భుతం… కానీ ఆ విష‌యం న‌న్ను బాధించింది: రాజ‌మౌళి