రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేటి భారత్ న్యూస్- రేషన్ కార్డుదారులకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్ లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందనున్నాయని ఆయన తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలా మంది ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం తినలేక కొందరు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రేషన్ షాపులో బియ్యంతో పాటు త్వరలో కందిపప్పు, ఉప్పు లాంటి ఇతర నిత్యావసర వస్తువులు ఇస్తామని తెలిపారు. అలానే రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఎంత మందికి కావాలన్నా అర్హతను బట్టి అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు లేకపోయినా లబ్దిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. 

Related Posts

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

నేటి భారత్ న్యూస్- ఆంధప్రదేశ్‌లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో నెలకొల్పనున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా,…

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

నేటి భారత్ న్యూస్-ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) అరుదైన ఘ‌న‌త సాధించింది. గురువారం స‌న్‌రైజ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 80 ప‌రుగుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘ‌న‌త‌.. తొలి జ‌ట్టుగా న‌యా రికార్డ్!

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

ఒవైసీ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా ఆ బిల్లు ఆగదు: బండి సంజయ్

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!

మెగా కోడ‌లు ఉపాస‌న భావోద్వేగ పోస్ట్… కార‌ణ‌మిదే!