వడగళ్ల వానతో పంట నష్టం…. ఆరాతీసిన సీఎం చంద్రబాబు

నేటి భారత్ న్యూస్- అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో జరిగిన ఈ సంఘటనపై ఆయన జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. మరింత మెరుగైన చికిత్స కోసం వారిని అనంతపురం తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా జరిగిన పంట నష్టంపై సమగ్ర సమీక్ష జరిపారు. కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లోని 40 గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదించారు. దాదాపు 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వారు వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Related Posts

‘ఎక్స్’ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్.. ఎంత‌కు, ఎవ‌రికో తెలుసా?

నేటి భారత్ న్యూస్- టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్ర‌పంచ‌కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, బయట వ్యక్తులకు మాత్రం కాదు. మస్క్ ఏఐ స్టార్టప్…

అమెరికాలో చదువుతున్న మన విద్యార్థులకు మరో టెన్షన్.. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్

నేటి భారత్ న్యూస్- అమెరికాలో చదువుకుంటున్న కొందరు విదేశీ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్ కార్యాలయం నుంచి ఈమెయిల్ అందింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ పేరుతో ఈ ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు అందులో హెచ్చరించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ఎక్స్’ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్.. ఎంత‌కు, ఎవ‌రికో తెలుసా?

‘ఎక్స్’ను అమ్మేసిన‌ ఎలాన్ మ‌స్క్.. ఎంత‌కు, ఎవ‌రికో తెలుసా?

అమెరికాలో చదువుతున్న మన విద్యార్థులకు మరో టెన్షన్.. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్

అమెరికాలో చదువుతున్న మన విద్యార్థులకు మరో టెన్షన్.. స్వచ్ఛందంగా వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్

 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 సంక్షేమ సారధి ఎన్టీఆర్… అభివృద్ధి ప్రదాత చంద్రన్న: మంత్రి నారా లోకేశ్‌

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 పట్టాలపై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సెల్‌ఫోన్ వెలుగు కాపాడింది!

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్

 ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో తనిఖీలు.. వేలాది నకిలీ వస్తువుల సీజ్