

నేటి భారత్ న్యూస్- టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారనే కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ షాక్ తగిలింది. వంశీని విచారించేందుకు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. మూడు రోజుల పాటు వంశీని కస్టడీకి అనుమతించింది. అయితే, పోలీసులకు కోర్టు కొన్ని షరతులు విధించింది. విజయవాడ పరిధిలోనే వంశీని విచారించాలని కోర్టు తెలిపింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని తెలిపింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది. మరోవైపు, వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి పడుకోవడానికి బెడ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.