వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

నేటి భారత్ న్యూస్- వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు ఇది శుభవార్తే. ఆ సంస్థ నుంచి 5జీ సేవలు నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఈ సేవలు ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్‌లకు సేవలను విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో 17 సర్కిళ్లలోని 100 నగరాలకు 5జీ సేవలను విస్తరించనుంది.  ప్రస్తుతానికి అపరిమిత యాడ్ ఆన్ కింద రూ. 299తో మొదలయ్యే పథకాల్లో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. తొలి దశ విస్తరణ అనంతరం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నైలకు 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్‌సింగ్ తెలిపారు. ఫైబర్ కేబుళ్లు, సెల్ టవర్లు వంటి సంప్రదాయ అనుసంధాన వసతులు లేని ప్రదేశాల్లో శాటిలైట్ సేవల కోసం కొన్ని సంస్థలతో చర్చిస్తున్నట్టు జగ్బీర్‌సింగ్ తెలిపారు.

Related Posts

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

నేటి భారత్ న్యూస్- తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని…

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమ‌ల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం చంద్ర‌బాబు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం