హిందువులు నడిపే మటన్ షాపుల కోసం ‘మల్హర్ సర్టిఫికేషన్’

నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలో జట్కా మటన్ షాపుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ సర్టిఫికేషన్ కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమేనని ఫిషరీస్ మంత్రి నితీశ్ రాణే తెలిపారు. జట్కా మాంసం సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా ‘మల్హర్ సర్టిఫికేషన్ డాట్ కామ్‌’ అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు రాణే ప్రకటించారు. దీనిని ప్రత్యేకంగా హిందువులు నిర్వహిస్తారని, మాంసంలో ఎక్కడా కల్తీ ఉండదని నొక్కి చెప్పారు. అంతేకాదు, మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో హిందువులు మాంసం కొనవద్దని సూచించారు.  దేశంలో ప్రస్తుతం ఉన్న హలాల్ సర్టిఫికేషన్ లాంటిదే మల్హర్ సర్టిఫికేషన్. హలాల్‌లో షరియా, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మాంసాన్ని రెడీ చేస్తారు. ఒక జంతువును తినేందుకు ముందు దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలో బలి ఇవ్వాలని ఇస్లాం చెబుతుంది. అయితే, హలాల్‌కు భిన్నంగా జట్కాలో ఒకే దెబ్బతో నొప్పి లేకుండా జంతువును బలి ఇస్తారు.  మల్హర్ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్ ప్రకారం జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికెట్‌ను ఇస్తారు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం మేక లేదా, గొర్రెను బలి ఇస్తారు. ఆ తర్వాత మాంసాన్ని సిద్ధం చేస్తారు. ఈ మాంసం ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల వద్ద లభిస్తుంది. కాబట్టి మల్హర్ ధ్రువీకరించిన విక్రేతల నుంచి మాత్రమే మటన్ కొనుగోలు చేయాలని కోరుతున్నట్టు వెబ్‌సైట్ పేర్కొంది. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌