హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం:

నేటి భారత్ న్యూస్- హైడ్రా పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘పడిపోయిన రిజిస్ట్రేషన్లు’ అంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.అధికారం కోసం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేస్తామని చెబుతారని, అధికారం దక్కిన తర్వాత ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని ఎద్దేవా చేశారు. హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో హైదరాబాద్‌లో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో పేదల ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల రిజిస్ట్రేషన్లు పాతాళానికి పడిపోయాయని పేర్కొన్నారు.ఆదాయం అడుగంటి పోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో లక్షన్నర కోట్ల అప్పులు అయ్యాయని, కానీ హామీల అమలు మాత్రం గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పదిహేను నెలల పాలన నిర్వాకం మూలంగా రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గారడిలో సామాన్యులు సమిధలుగా మారారని మండిపడ్డారు. తెలంగాణ మేలుకోవాలంటూ ట్వీట్‌ను ముగించారు.

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌