హైడ్రా’ పేరుతో వసూళ్ల దందా.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

నేటి భారత్ న్యూస్-హైడ్రా పేరుతో ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు వ‌సూళ్ల దందా న‌డిపిస్తున్నార‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్ల‌పై పగబ‌ట్టార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును విమ‌ర్శిస్తూ పోస్టు పెట్టారు. ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్య‌మంత్రి ఫ్యామిలీ రియ‌ల్ వ్యాపారం చేస్తోంద‌ని మాజీ మంత్రి దుయ్య‌బ‌ట్టారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూముల ఆక్రమణకు పాల్ప‌డుతున్నారని ఫైర్ అయ్యారు. పేద‌ల‌పై ప్ర‌తాపం చూపిస్తూ పెద్ద‌ల‌తో ఒప్పందం చేసుకుంటార‌ని విమ‌ర్శించారు. ఆరు గ్యారంటీలు గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలుకు పంపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుభరోసా రాదు.. రుణమాఫీ కాదన్నారు. అలాగే పంటలు కొనుగోలు చేయర‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లార‌ని మండిప‌డ్డారు. ఇది పాలన కాదు పీడన అని అన్నారు. అలాగే ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ అని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.  

Related Posts

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

నేటి భారత్ న్యూస్- భారత్‌కు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రికార్డుస్థాయి ధర పలికింది. ‘గ్రామయాత్ర’ పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా రూ. 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్ర కళలో ఇది అత్యంత ఖరీదైన…

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితమైన విషయం విదితమే. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అటు నియోజకవర్గానికి కానీ, ఇటు అసెంబ్లీకి కానీ వెళ్లడంలేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఎంఎఫ్ హుస్సేన్ చిత్రానికి రూ. 118 కోట్లు.. ఖరీదైన కళాఖండంగా రికార్డు

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

 ఐపీఎల్‌లో అలా చేస్తే టీమిండియాలో చోటు.. సురేశ్ రైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు టులెట్ బోర్డు

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

 తిరువణ్ణామలై కొండపైకి ధ్యానానికి వెళ్లిన విదేశీయురాలిపై గైడ్ అఘాయిత్యం

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

ఆ స్టూడియో భూములు ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి ..ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి