ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే కనుక బతికిపోతారు.. ట్రంప్‌తో పుతిన్

నేటి భారత్ న్యూస్- ఉక్రెయిన్ దళాలు కనుక ఆయుధాలు వదిలేసి లొంగిపోతే ప్రాణాలతో బతికిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. వేలాదిమంది ఉక్రెయిన్ సైనికులను రష్యన్ దళాలు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ దళాలను వదిలేయాలన్న ట్రంప్ అభ్యర్థనకు పుతిన్ ఇలా సమాధానమిచ్చారు. ‘‘వారు కనుక లొంగిపోతే, వారి ప్రాణాలకు మాది గ్యారెంటీ’’ అన్నట్టు పుతిన్‌ను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్’ పేర్కొంది.  రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియడానికి ‘చాలా మంచి అవకాశం’ ఉందని, పుతిన్‌తో గురువారం ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్రంప్ నిన్న తెలిపారు. ‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో నిన్న ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఈ భయంకరమైన, రక్తపాతంతో కూడిన యుద్ధం చివరకు ముగిసిపోయేందుకు చాలా మంచి అవకాశం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పూర్తిగా చుట్టుముట్టబడిన ఉక్రెయిన్ దళాల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను అభ్యర్థించినట్టు చెప్పారు.   కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో, కీవ్‌ను కోరుతున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరువైపులా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.  

Related Posts

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నేటి భారత్ న్యూస్- ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని…

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

నేటి భారత్ న్యూస్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సెషన్ మొత్తానికి ఆయనను సస్పెండ్ చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

నా 25 ఏళ్ల కల నెరవేరింది: శివాజీ

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించండి.. మాట్లాడే అవకాశం కల్పించండి: హరీశ్ రావు

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

 ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చిన కెనడా కొత్త ప్రధాని

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ఏనాడైనా ప్రజల్లో తిరిగారా..? జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

పారిశుద్ధ్య కార్మికుల‌తో సీఎం చంద్ర‌బాబు ముఖాముఖి

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

 విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు