శంషాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌యాణికుల నిర‌స‌న‌…

నేటి భారత్ న్యూస్- శంషాబాద్ విమానాశ్ర‌యంలో కొంద‌రు ప్ర‌యాణికులు ఆందోళ‌నకు దిగారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌యాణికులు మూడు గంట‌ల‌పాటు తిండితిప్ప‌లు లేకుండా ప‌డిగాపులుకాయాల్సి వ‌చ్చింది. సాంకేతిక లోపం కార‌ణంగా ఫ్లైట్ మూడు గంట‌లు ఆల‌స్య‌మైన‌ట్లు స‌మాచారం. దాంతో వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ స్పైస్ జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానంలో ఏదైనా స‌మ‌స్య ఉంటే… ఆల‌స్యం అవుతుంద‌ని ప్ర‌యాణికుల‌కు ముంద‌స్తు స‌మాచారం ఇవ్వాల్సింద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తీరా విమానాశ్ర‌యానికి వ‌చ్చేసిన త‌ర్వాత ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా ఇలా గంట‌ల‌ త‌ర‌బ‌డి కూర్చోబెట్టడం ఏంట‌ని ప్ర‌యాణికులు సిబ్బందిపై మండిప‌డ్డారు. అస‌లే ఈరోజుతో ప్ర‌యాగ్‌రాజ్ లో జరుగుతున్న‌ మ‌హా కుంభమేళా ముగియ‌నుంది. ఇలాంటి స‌మ‌యంలో ఎయిర్‌లైన్స్ యాజ‌మాన్యం ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, జ‌న‌వ‌రి 13న ప్రారంభ‌మై 45 రోజుల పాటు జ‌రిగిన కుంభ‌మేళా ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈరోజు భారీగా భ‌క్తులు ప్ర‌యాగ్‌రాజ్‌కు క్యూ క‌డుతున్నారు. ఇక ఇప్ప‌టికే 60 కోట్ల‌కు పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కార్ వెల్ల‌డించింది.  

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌