ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన పుతిన్

నేటి భారత్ న్యూస్- అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతోంది. దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా సహా పలు దేశాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో అనేక దేశాలు హర్షించే ఒక ప్రతిపాదనను అమెరికా చేసింది. రక్షణ ఖర్చులను 50 శాతం తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనాలకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. అయితే చైనా మాత్రం దీనికి అంగీకరించలేదు.ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడంతో, ఒకప్పుడు ప్రచ్చన్న యుద్ధం కొనసాగిన అమెరికా, రష్యా మధ్య స్నేహం చిగురించే ఆశలు కనిపిస్తున్నాయి. ట్రంప్ సూచన మంచి ప్రతిపాదన అని పుతిన్ పేర్కొన్నారు. ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. అయితే, విస్తరణ వాదంతో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాత్రం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు.ట్రంప్ ప్రతిపాదనపై ఓ టీవీ ఇంటర్వ్యూలో మాస్కో వైఖరిని ప్రశ్నించగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాధానమిచ్చారు. ఇది మంచి ఆలోచనగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘అమెరికా రక్షణ బడ్జెట్ 50 శాతం తగ్గిస్తుంది. మనం కూడా 50 శాతం తగ్గిస్తాం. ఆపై చైనా కూడా చేరితే అంగీకారం కుదురుతుంది’ అని పుతిన్ అన్నారు. చైనా తరపున తాను మాట్లాడటం లేదని చెబుతూనే రష్యా మాత్రం కచ్చితంగా చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు.రక్షణ ఖర్చులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించడం చూస్తే ఉక్రెయిన్ యుద్ధ విరమణకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. 

Related Posts

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

నేటి భారత్ న్యూస్- యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12.00 గంట‌లకు నిర్వహించిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌, నారా బ్రాహ్మణి దంపతులు…

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

నేటి భారత్ న్యూస్– శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.  ఇక‌ చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు ‘సూర్య‌’బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్: గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

 బంగారం పరుగులు.. రూ. 90 వేలు దాటిన పసిడి!

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ ఏకగ్రీవం

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌

బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌